క‌రోనా బాధితులకు అండగా విజయ్ సేతుపతి

Vijay Sethupati contributed RS 25 lakhs to the tamilnadu CM's relief fund.క‌రోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభ‌త్సం నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 7:28 AM GMT
క‌రోనా బాధితులకు అండగా విజయ్ సేతుపతి

క‌రోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభ‌త్సం నుంచి ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు కోలుకుంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు త‌మ వంతుగా విరాళాలు అందించాల‌ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. సీఎం పిలుపుకు విశేష స్పంద‌న వ‌స్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళ న‌టుడు సూర్య‌, కార్తి లు క‌లిసి కోటి రూపాయ‌ల విరాళంగా అందించ‌గా.. మురుగ‌దాస్ 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ భ‌ర్త విశాగ‌ణ్ కోటి రూపాయ‌లు అందించారు.

తాజాగా దక్షిణాది నటుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి క‌రోనా బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు రూ .25 లక్షలు అందించారు. నటుడు టిఎన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను సచివాలయంలో కలుసుకుని ఆ మొత్తానికి చెక్కును సమర్పించారు. ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తి అటు త‌మిళంలోనే కాక ఇటు తెలుగులోనూ వ‌రుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. హీరోగా రాణిస్తూనే విల‌న్‌గా న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీలో విజయ సేతుపతి నటించాడనున్నాడనే వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే.. దీని పై చిత్ర‌బృందం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.


Next Story
Share it