బాహుబలి-2 ని దాటేసిన విజయ్ సేతుపతి సినిమా

బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ని చైనాలో 'మహారాజా' అధిగమించాడు.

By Kalasani Durgapraveen  Published on  16 Dec 2024 12:00 PM GMT
బాహుబలి-2 ని దాటేసిన విజయ్ సేతుపతి సినిమా

బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ని చైనాలో 'మహారాజా' అధిగమించాడు. బాహుబలి 2 తర్వాత భారతదేశానికి చెందిన సినిమాలు అక్కడ మంచి కలెక్షన్స్ సాధించడంలో విఫలమయ్యాయి. ప్రభాస్- రాజమౌళిల చిత్రం చైనాలో మంచి ఓపెనింగ్‌లను సొంతం చేసుకున్నా.. లాంగ్ రన్ లో కేవలం 80 కోట్ల వద్ద నిలిచిపోయింది. ఇప్పుడు, విజయ్ సేతుపతి 'మహారాజా' సినిమా చైనాలో బాహుబలి 2 ను దాటేసింది.

మహారాజా చైనాలో 17 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత 81 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి 2ని అధిగమించింది, ఇది సంచలనాత్మక ఫీట్. మరో వారం లేదా 10 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత సినిమాగా మహారాజా నిలిచింది. గత కొన్నేళ్లుగా ఇతర హీరోల చిత్రాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన విజయ్ సేతుపతి ఇక నుంచి విలన్ పాత్రలు చేయనని ప్రకటించారు. సోలో హీరోగా మహారాజా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Next Story