ఇట్స్ అఫీషియల్..మణిరత్నం నెక్స్ట్ మూవీలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి

విలక్షణ దర్శకుడు మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇద్దరు అద్భుతమైన నటులతో ప్లాన్ చేస్తున్నారు

By -  Knakam Karthik
Published on : 20 March 2026 2:52 PM IST

Cinema News, ManiRatnam, Vijay Sethupathi, SaiPallavi, AR Rahman, Madras Talkies, South Cinema

ఇట్స్ అఫీషియల్..మణిరత్నం నెక్స్ట్ మూవీలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి

విలక్షణ దర్శకుడు మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇద్దరు అద్భుతమైన నటులతో ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ క్రేజీ మూవీపై అధికారిక ప్రకటన వెలువడింది. కమల్ హాసన్‌తో మణిరత్నం తీసిన 'థగ్ లైఫ్' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త చిత్రం పట్టాలెక్కుతోంది.

మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. గత మూడు దశాబ్దాలుగా మణిరత్నం తన ప్రతి సినిమాకు రెహమాన్‌తోనే కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్‌ను తీసుకుంటున్నారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టమైంది.

ప్రస్తుతం విజయ్ సేతుపతి, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే సినిమాలో నటిస్తుండగా, సాయి పల్లవి రణబీర్ కపూర్ సరసన 'రామాయణం' చిత్రంలో బిజీగా ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులు మణిరత్నం ఫ్రేమ్స్‌లో ఎలా కనిపిస్తారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story