రౌడీ వ‌చ్చేస్తున్నాడు

Vijay Deverakonda new movie first look title announcement tomorrow.టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ కొత్త సినిమా టైటిల్‌ను, ఫ‌స్ట్‌లుక్‌ను రేపు అనౌన్స్ చేయ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Jan 2021 5:05 PM IST

Vijaya Deverakonda new movie first look

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ నటిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ఫైట‌ర్ అనే పేరు ప్ర‌చారంలో ఉంది. కానీ ఇటీవల ఈ పేరుతో బాలీవుడ్లో హృతిక్ తన నూతన చిత్రం మొదలు చేయడంతో పూరి తన సినిమాకు మరో పేరు వెతుక్కోవాల్సి వచ్చింది. దాంతో అభిమానుల్లో ఈ సినిమా పేరు ఏమని పెడతారన్న విషయం ఆసక్తి రేపుతోంది.

తాజాగా పూరి కనెక్ట్స్ నుంచి ట్విస్టిస్తూ ఊహించని ప్రకటన వెలువడింది. 'కథలు భాషల్లో నుంచి పుట్టకు రావు. కథలు విలువ అవి అలరించే తీవ్రతను బట్టి ఉంటుంది. ప్రేక్షకులని భావొద్వేగ పూర్వకంగా కదిలించే శక్తి కథలకి ఉంది. గతించిన‌ సంవత్సరాల్లో మేము అనేక విలక్షణ కథలను మీ ముందుకు తీసుకొచ్చాము. ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా చిత్రీకరించి మిమ్మల్ని అలరించాం. మా ఈ ప్రయాణంలో రేపు మరో అధ్యాయాన్ని కలపబోతున్నా'మని ట్వీట్‌లో రాసుకొచ్చాడు.


మూవీ టైటిల్‌ను, ఫ‌స్ట్‌లుక్‌ను రేపు ఉద‌యం 10గంట‌ల 8 నిమిషాల‌కు అనౌన్స్ చేయ‌నున్నారు. ఈ అప్‌డేట్‌ కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ధర్మ మూవీస్ తో కలిసి పూరి కనెక్ట్స్ (పూరి-ఛార్మి) నిర్మిస్తోంది. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. బాక్సింగ్ .. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలోని ఈ మూవీ కోసం విజయ్ భారీగా కండలు పెంచి 6 ప్యాక్ ట్రై చేస్తున్న సంగతి తెలిసినదే.




Next Story