ఆరోజున దేవర రానట్టే.. దేవరకొండ వస్తున్నాడు

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా ఏప్రిల్ 5న రావాల్సి ఉంది.

By Medi Samrat  Published on  2 Feb 2024 8:00 PM IST
ఆరోజున దేవర రానట్టే.. దేవరకొండ వస్తున్నాడు

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా ఏప్రిల్ 5న రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా వాయిదా పడితే మాత్రం.. ఆ డేట్‌కి మేము నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని విడుదల చేస్తామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత దిల్ రాజు కొద్దిరోజుల కిందట ప్రకటించారు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 5న విడుదల తేదీతో ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో దేవర సినిమా ఆరోజున వచ్చేది డౌట్ అని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమా ఎట్టకేలకు అనేక వాయిదాల తర్వాత విడుదల తేదీ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఏప్రిల్ 5, 2004న విడుదల కానుంది. ఇంతకు ముందు విజయ్ దేవరకొండతో కలిసి పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమా 'గీత గోవిందం'. ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story