అభిమానుల‌కు పూన‌కాలే.. అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లింప్స్

Vijay Deverakonda Liger Movie first glimpse out.యంగ్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం లైగ‌ర్‌. పూరీ జ‌గ‌న్నాథ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 11:10 AM IST
అభిమానుల‌కు పూన‌కాలే..  అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లింప్స్

యంగ్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం 'లైగ‌ర్‌'. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న అన‌న్య పాండే న‌టిస్తోంది. కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మైక్ టైస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర గ్లింప్స్, టీజ‌ర్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతూ చిత్రబృందం శుక్ర‌వారం ఉద‌యం లైగ‌ర్ ఫ‌స్ట్ గ్లింప్స్ ని విడుద‌ల చేసింది.

'లేడీస్ అండ్ జెంటిమేన్ మీ అంద‌రూ ఎదురుచూస్తోన్న రోజు వ‌చ్చేసింది. మా వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. ముంబై వీధ‌ల్లో పెరిగిన స్ల‌మ్ డాగ్‌, చాయ్ వాలా.. ది లైగ‌ర్' అంటూ విజ‌య‌దేవ‌ర‌కొండ‌ను ప‌రిచ‌యం చేస్తూ 53 సెక‌న్ల పాటు ఈ గ్లింప్స్ సాగింది. ఇందులో ప్ర‌తి సీన్ అద‌ర‌గొట్టేలా ఉంది. ఇక విజ‌య్ చెబుతున్న డైలాగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. దాదాపు రూ.125 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని చార్మి, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో తెర‌కెక్కుతోంది. కన్నడ, తమిళ, మలయాళంలో డ‌బ్ చేయ‌నున్న ఈ చిత్రంలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story