ఉదయ్‌పూర్‌కు చేరుకున్న 'విరోష్' జోడీ (video)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సిద్ధమైంది

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 7:16 PM IST

Cinema News, Vijay Deverakonda, Rashmika Mandanna, , Udaipur Wedding, Tollywood Updates, VijayRashmika Marriage

ఉదయ్‌పూర్‌కు చేరుకున్న 'విరోష్' జోడీ (video)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సిద్ధమైంది. ఫిబ్రవరి 26న జరగనున్న తమ వివాహం కోసం ఈ జంట తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి విజయ్ తన తమ్ముడు ఆనంద్, తల్లిదండ్రులతో కలిసి బయలుదేరగా, రష్మిక కూడా తన కుటుంబంతో కలిసి అక్కడికి చేరుకుంది.

వీరిద్దరి పేర్లను కలిపి 'విరోష్' (VIROSH) అనే పేరుతో ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఉదయ్‌పూర్‌లోని అత్యంత విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) రిసార్ట్‌లో ఈ వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో మెహందీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనుండగా, 26వ తేదీన అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ స్నేహం మరియు ప్రేమ తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతోంది. వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

Next Story