థియేటర్‌లో అభిమానుల‌తో కలిసి లైగర్‌ చూసిన విజయ్‌, అనన్య

Vijay Deverakonda and Ananya Panday watch Liger movie with fans.యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం లైగ‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2022 11:25 AM IST
థియేటర్‌లో అభిమానుల‌తో కలిసి లైగర్‌ చూసిన విజయ్‌, అనన్య

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం 'లైగ‌ర్‌'. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంతో ఇటు పూరి, అటు విజయ్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌తో క‌లిసి వీక్షించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో క‌థానాయిక అన‌న్యా పాండేతో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ గురువారం ఉద‌యం 'లైగ‌ర్' చిత్రాన్ని చూశాడు. విజ‌య్‌ను చూడ‌గ‌నే అక్క‌డ ఉన్న అభిమానులు లైగ‌ర్ లైగ‌ర్ గ‌ట్టిగా నినాదాలు చేశారు. వారి అభిమానానికి ఫిదా అయిన విజ‌య్ వారికి అభివాదం చేసిన అనంత‌రం థియేటర్లో ఫ్యాన్స్‌ ఈలలు, గోలల మధ్య సినిమాను చూశారు. అభిమానులు వీళ్ల దగ్గరికి వెళ్లకుండా విజయ్‌, అనన్య చుట్టూ బౌన్సర్లు నిల్చొని ఉండటం విశేషం.

ఇక తెలుగు రాష్ట్రాల్లో లైగ‌ర్ సినిమా విడుద‌ల కావ‌డంతో ప‌లు థియేట‌ర్ల‌లో విజ‌య్ అభిమానుల సంద‌డి మామూలుగా లేదు. థియేట‌ర్ల వ‌ద్ద భారీ క‌టౌట్లు, పాలాభిషేకాలు, తీన్ మార్ డ్యాన్స్ ల‌తో పుల్ జోష్‌లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story