నాతో బెడ్ షేరింగ్ చేసుకుంది ఎవరో తెలుసా..? : విజయ్ దేవరకొండ
Vijay Devarakonda shares his bed with Anandh video goes viral.యంగ్ హీరో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఓ వీడియో
By తోట వంశీ కుమార్ Published on 10 Nov 2021 12:26 PM ISTయంగ్ హీరో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాతో పాటు బెడ్ షేర్ చేసుకుంది ఎవరో తెలుసా అంటూ విజయ్ ఆ వీడియోని పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విజయ్‌తో బెడ్ షేర్ చేసుకుంది ఎవరో అని ఎక్కువగా ఊహించుకోకండి. ఎందుకంటే అతడి పక్కన ఉన్నది అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ.
ఆనంద్ హీరోగా నటించిన చిత్రం పుష్పక విమానం. ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తమ్ముడి సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై వేసుకున్నాడు విజయ్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ వైజాగ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి విజయ్.. కాస్తడిఫరెంట్‌గా వీడియో రూపొందించి పోస్ట్ చేశాడు.
ఆ వీడియోలో ఏం ఉందంటే..? తమ్ముడితో కలిసి బెడ్‌పై పడుతున్న విజయ్.. మధ్యలో లేచి తమ్ముడిని సుందర్ అని పిలుస్తూ నిద్ర లేపాడు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటిరా..? నీ భార్య ఎక్కడుంది..? అంటూ పలుమార్లు ఆనంద్‌ను విసింగించాడు. దీంతో ఆనంద్ నా పెళ్లాం లేచిపోయిందిరా అని చెప్పి మళ్లీ ముసుగు తన్ని పడుకున్నాడు. ఈ వీడియోను విజయ్ ట్విటర్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఆనంద్ మూడో చిత్రంగా 'పుష్పక విమానం' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దామోదర అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు. సునీల్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు. పెళ్లైన వారానికే పెళ్లాం లేచిపోతే.. వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపేలా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు.
Guess who is sharing the bed with me today 😉
— Vijay Deverakonda (@TheDeverakonda) November 9, 2021
Book your tickets now - https://t.co/0neeFHptsf pic.twitter.com/qQrDTt5dSr