మరో బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ రొమాన్స్
Vijay devarakonda romance with katrina kaif. విజయ్ రెండో బాలీవుడ్ సినిమా గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన అందాల భామ కత్రిన కైఫ్ నటించనుందట.
By తోట వంశీ కుమార్ Published on
6 May 2021 8:02 AM GMT

'లైగర్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది. ఇంకా.. ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే విజయ్ రెండో బాలీవుడ్ సినిమా గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన అందాల భామ కత్రిన కైఫ్ నటించనుందట. ఇప్పటికే ఈ చిత్రానికి విజయ్ సంతకం కూడా చేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే కత్రిన.. ఇన్ స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండను ఫాలో అవుతుండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లుంది. ఈ చిత్రాన్ని కూడా కరణ్ జోహారే నిర్మించనట్లు టాక్. ఇంకా ఈ చిత్రంలో నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దేవరకొండ ఇంకా బాలీవుడ్ లో ప్రవేశించనే లేదు. కానీ అతడికి బాలీవుడ్ నాయికలు అభిమానులుగా మారారు. ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న దక్షిణ భారత నటుడిగా పాపులరయ్యాడు.
Next Story