విజయ్ దేవరకొండ మూవీకి టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ విడుదల
Vijay Devarakonda new movie title is Liger.టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌దేవరకొండ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్నా సినిమా టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ విడుదల.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌దేవరకొండ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌పుల్ యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం నేడు అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి 'లైగర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లయన్(lion)లో li ని టైగర్(tiger)లో ger ని తీసుకుని ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. సాలా క్రాస్‌బ్రీడ్ అనేది ఉపశీర్షిక.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. రెండు చేతులకు బాక్సింగ్ గ్లౌజులు తొడుక్కొని విజయ్‌దేవరకొండ ఎవరినో కొట్టడానికి చూస్తుండగా.. వెనుక సగం సింహం, సగం పులి ఫోటోతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అందరిని అలరిస్తోంది. కాగా లైగర్ అంటే మగ సింహం, ఆడ పులిల సంతానం. ఇవి సింహం, పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి సింహాల్లానే గర్జిస్తాయి
Lion @DharmaMovies & Tiger @PuriConnects, The duo embarking to Roar together to cross all linguistic barriers to entertain
బాక్సింగ్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తోంది. ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.