'లైగర్‌' నుంచి క్రేజీ అప్డేట్‌.. రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్‌

Vijay devarakonda liger movie aafat song promo released. తాజాగా మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో 'ఆఫాట్' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను

By అంజి  Published on  4 Aug 2022 9:01 PM IST
లైగర్‌ నుంచి క్రేజీ అప్డేట్‌.. రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్‌

హీరో విజయ్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నటి ఛార్మి, కరణ్‌ జోహర్ కలిసి, పూరి జగన్నాథ్‌ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో విజయ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ.. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. విజయ్‌ 'లైగర్‌' కోసం ఆయన అభిమానులు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. మేకర్స్ వరుస అప్‌డేట్‌లతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.

తాజాగా మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో 'ఆఫాట్' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ప్రోమోకు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ పాట ఫుల్ లిరిక‌ల్ వీడియో రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇక ఇటీవలే విడుద‌లైన లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ మ్యూజిక్‌ లవర్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్‌ కానుంది.


Next Story