త‌న ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విజ‌య్ ఆంటోనీ.. ప్ర‌మాదం త‌రువాత తొలి ట్వీట్‌

Vijay Antony's first tweet after the shooting accident.విజ‌య్ ఆంటోనీ కొద్ది రోజుల క్రితం గాయ‌ప‌డిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2023 10:42 AM IST
త‌న ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విజ‌య్ ఆంటోనీ.. ప్ర‌మాదం త‌రువాత తొలి ట్వీట్‌

కోలీవుడ్ న‌టుడు, సంగీత ద‌ర్శ‌కుడు అయిన విజ‌య్ ఆంటోనీ కొద్ది రోజుల క్రితం గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌లేషియాలో 'బిచ్చ‌గాడు-2' చిత్ర షూటింగ్ లో బోట్‌లో యాక్ష‌న్ సీన్ తెర‌కెక్కిస్తుండ‌గా ప్ర‌మాదానికి గురైయ్యాడు. తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో స‌మీపంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. విజ‌య్ కుటుంబ స‌భ్యులు వెంట‌నే మ‌లేషియా వెళ్లి అత‌డిని చెన్నైకి తీసుకువ‌చ్చారు.

విజ‌య్ ఆంటోని ఆరోగ్య ప‌రిస్థితిపై రోజుకో వార్త వినిపిస్తోంది. ప్ర‌మాదంలో విజ‌య్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌ని, దంప‌తాలు ఊడిపోయాయ‌ని, అత‌డు కోమాలో ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో త‌మ అభిమాన న‌టుడికి ఏమైందోన‌ని కంగారు ప‌డుతున్నారు అభిమానులు. విజ‌య్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.

తాజాగా త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై విజ‌య్ ఆంటోనీ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. "మ‌లేషియాలో పిచైకారన్-2’ (బిచ్చగాడు-2) షూటింగ్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాను. ద‌వ‌డ‌, ముక్కుకు గాయాలు అయ్యాయి. వాటికి సంబంధించిన స‌ర్జ‌రీ పూర్తి అయ్యింది. ఇప్పుడే ఒక పెద్ద స‌ర్జ‌రీ జ‌రిగింది. నేను వేగంగా కోలుకుంటున్నా. మీ అంద‌రితో త్వ‌ర‌లోనే మాట్లాడుతా. నేను కోలుకోవాల‌ని, నా ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ద వ‌హించిన, స‌హ‌క‌రించినందుకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు." అని విజ‌య్ ఆంటోనీ ట్వీట్ చేశాడు.

Next Story