న‌డి రోడ్డు మీద స్నానం చేసిన న‌టుడు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Video of actor Milind Soman taking a bath on the road goes viral.బాలీవుడ్ న‌టుడు మిలింద్ సోమ‌న్ ప‌రిచ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 2:06 AM GMT
న‌డి రోడ్డు మీద స్నానం చేసిన న‌టుడు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

బాలీవుడ్ న‌టుడు మిలింద్ సోమ‌న్ ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. సినిమాల్లో కంటే అత‌డు చేసే వెరైటీ ప‌నుల‌తోనే వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక మిలింద్ సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్క‌వుట్స్‌తో పాటు ఫ‌న్నీ వీడియోల‌ను అభిమానుల‌తో పంచుకుంటాడు. తాజాగా అత‌డు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఏం ఉందంటే.. అర్థ‌రాత్రి మిలింద్ న‌డిరోడ్డు మీద స్నానం చేశాడు. అదీ కూడా వ‌ర్షం వ‌స్తుండ‌గా.. వేడి నీటితో స్నానం చేశాడు.

దేని గురించి అయినా నిర‌స‌న‌లో భాగంగా ఇలా చేశాడు అని అనుకోకండి.. షూటింగ్‌లో భాగంగా అత‌డు ఇలా చేశాడు. ఓ వైపు వర్షం పడుతుండగా వేన్నీళ్లతో స్నానం చేశానని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. పుషప్స్‌, రన్నింగ్స్‌తో పాటు ఇంకేదైనా చేయగలనా అని డౌట్‌ పడేవారికి ఈ వీడియోనే సమాధానమని రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మదైన శైలిలో స్పందిస్తున్నారు.

మిలింద్‌.. టర్కీబ్‌, 16 డిసెంబర్‌, బాజీరావ్‌ మస్తానీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ సినిమాలతో పాటు పచ్చైకిలి, సత్యమేవ జయతే, అలెక్స్‌ పాండియన్‌ వంటి దక్షిణాది చిత్రాల్లోనూ నటించాడు. ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌.

Next Story