విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు చేయడంతో, నిర్మాతలు ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. చావా సినిమాను తెలుగులో విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ఈ సినిమాను తెలుగు భాషలో విడుదల చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.
ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు మహమ్మద్ జియా-ఉల్-హక్.. చావాపై నెల్లూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా వాస్తవాలను వక్రీకరించిందని ఆరోపించారు. ఈ సినిమా ఏపీలో ప్రదర్శనను నిలిపివేయాలని, సినిమాపై నిషేధం విధించాలని కూడా ఆయన కోరారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో చావా విడుదల కానుంది. ఈ చిత్ర బృందం ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లను ప్రారంభించింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుందని మేకర్స్ కూడా భావిస్తున్నారు.