స్టార్ హీరోపై నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న వేధింపులను సీనియర్ నటి విచిత్ర తమిళ బిగ్‌బాస్‌లో రివీల్ చేశారు. యూనియన్‌కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు.
By అంజి Published on 22 Nov 2023 12:00 PM ISTస్టార్ హీరోపై నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న వేధింపులను సీనియర్ నటి విచిత్ర తమిళ బిగ్‌బాస్‌లో రివీల్ చేశారు. '2000 సంవత్సరంలో తీసిన ఓ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరో నన్ను రూమ్‌కు రమ్మన్నాడు. అతని ఆఫర్‌ను తిస్కరించినందుకు మరుసటి రోజు నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. తాగొచ్చి నా రూమ్ ముందు ప్రతి రోజు గొడవ చేసేవాడు. యూనియన్‌కు కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకపోవడంతో సినిమాలకు గుడ్‌బై చెప్పా' అని పేర్కొన్నారు.
కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో ప్రభావవంతమైన పార్టిసిపెంట్లలో ఒకప్పటి నటి విచిత్ర ఒకరు. నవంబర్ 1న కంటెస్టెంట్స్‌ని బిగ్‌బాస్ తమ జీవితంలో ఒక అతి పెద్ద మలుపు గురించి మాట్లాడమని అడిగారు. ఈ క్రమంలోనే విచిత్ర కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం ఓ తెలుగు చిత్రంలో పని చేస్తున్నప్పుడు కాస్టింగ్ కౌచ్ కారణంగా తాను సినిమా నుండి వైదొలిగానని చెప్పారు. ఈ ఘటనపై యూనియన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
విచిత్ర 1991లో సినిమాల్లోకి ప్రవేశించి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాల్లో నటించింది. విజయ్ టెలివిజన్ యొక్క ప్రసిద్ధ వంట రియాలిటీ షో 'కుకు విత్ కోమలి 4'లో ఆమె ఫైనలిస్ట్‌లలో ఒకరు. బిగ్ బాస్ తమిళ్ 7లో, ఆమె టాప్ పెర్ఫార్మర్స్‌లో ఒకరు. నిన్న (నవంబర్ 21) ఆమె 20 ఏళ్ల క్రితం సినిమా నుండి తప్పుకునేలా చేసిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఇదిలా ఉంటే.. 2012 ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఆమె స్టంట్ డైరెక్టర్ ఎ విజయ్‌పై 'శారీరక వేధింపుల' కేసు పెట్టింది .
"2000 సంవత్సరంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఫారెస్ట్ ఏరియా వెళ్లాం. అక్కడ మాకు త్రీ స్టార్ హోటల్‌లో విడిది ఏర్పాటుచేశారు. నటీనటుల కోసం ఏర్పాటుచేసిన పార్టీలో ఆ సినిమా హీరోను కలిశాను. అతడు నా పేరు కూడా అడగకుండా రాత్రికి రూమ్‌కు వచ్చేయమని అన్నాడు. అతడి మాటలు విని షాకయ్యాను. అతడి ఆఫర్‌ను తిరస్కరినందుకు మరుసటి రోజు నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. తాగొచ్చి నా రూమ్ ముందు ప్రతిరోజు గొడవ చేసేవాడు. ఆ హీరో బారి నుంచి తప్పించుకోవడానికి రోజుకో రూమ్ మార్చా. ఆ హీరోపై అసోసియేషన్‌లో కంప్లైట్ ఇచ్చాను. అయినా నాకు న్యాయం జరగలేదు. ఆ సంఘటన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పా" అని విచిత్ర తెలిపింది. ఆ సమయంలో తనకు హోటల్ మేనేజర్ చాలా హెల్ప్ చేశాడని, అప్పుడు మా మధ్య ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసిందని, ఆ హోటల్ మేనేజర్ నే తాను పెళ్లి చేసుకున్నట్లు విచిత్ర తెలిపింది.