ఓటీటీలోకి 'విడుదల పార్ట్ 1'

VetriMaaran’s Vidudala Part 1 is now streaming on OTT. ప్రఖ్యాత దర్శకుడు వెట్రిమారన్ తాజా చిత్రం విడుతలై పార్ట్ 1 థియేట్రికల్ రన్ లో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది.

By Medi Samrat  Published on  24 May 2023 9:23 AM IST
ఓటీటీలోకి విడుదల పార్ట్ 1

ప్రఖ్యాత దర్శకుడు వెట్రిమారన్ తాజా చిత్రం విడుతలై పార్ట్ 1 థియేట్రికల్ రన్ లో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో 'విడుదల పార్ట్ 1' గా కూడా విడుదలైంది. ఈ చిత్రం గత నెలలోనే తమిళ భాషలో OTTలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ OTTలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ZEE5 సినిమా హక్కులను కొనుగోలు చేసింది. తెలుగు వెర్షన్ తో పాటూ తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ZEE5లో అందుబాటులో ఉంది.

సూరీ ఈ సినిమాలో హీరోగా కనిపించి.. మంచి మార్కులు అందుకున్నాడు. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి క్యామియో రోల్‌లో కనిపించాడు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ మార్చి 31న విడుదలైంది. థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న విడుతలై పార్ట్‌-1కు ఓటీటీలోనూ మంచి వ్యూస్‌ వచ్చాయి. ఏప్రిల్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కేవలం తమిళ్‌ వెర్షన్‌ మాత్రమే. తాజాగా తెలుగు వెర్షన్‌ విడుదల పార్ట్‌ 1కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ 5 లోఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా డైరెక్టర్స్ కట్ కు కూడా మంచి ఆదరణ వస్తోంది. సినిమాలో భవాని శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.



Next Story