సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మరాఠీ నటుడు ప్రదీప్ పట్వర్ధన్ కన్నుమూశారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు.
'ఎక్ ఫుల్ ఛార్ హాఫ్', 'డాన్స్ పార్టీ', 'మే శివాజీరాజీ భోంస్లే బోల్తె' వంటి మరాఠి సినిమాలతో ప్రదీప్ పట్వర్ధన్ మంచి గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్‌లో సైతం నటించారు. ప్రదీప్ ఆకస్మిక మరణంతో మరాఠి చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంతాపం తెలిపారు. మరాఠీ సినిమాలో తన మనోహరమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ప్రదీప్ పట్వర్ధన్ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి చిత్ర పరిశ్రమ ఓ లెజెంటరీ నటుడిని కోల్పోయిందని ట్వీట్ చేశారు.
మరాఠి పరిశ్రమకు చెందిన సినీ, టీవీ నటీనటులు సైతం ప్రదీప్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.