కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

Veteran actor of KGF fame Krishna G Rao passes away.చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 5:10 AM GMT
కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ న‌టుడు, కేజీఎఫ్ ఫేమ్ కృష్ణ.జి.రావు క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బెంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుటుంబ సభ్యులు తెలియ‌జేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల క‌న్న‌డ ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది.

య‌శ్ హీరోగా తెర‌కెక్కిన 'కేజీఎఫ్' తొలి భాగంలో కృష్ణ.జి.రావు క‌నిపిస్తారు. ఈ చిత్రంలో రాఖీ భాయ్ మ‌న‌సు మార‌డానికి కార‌ణం ఈ తాత‌నే. అందుడైన తాత‌ను విల‌న్ గ్యాంగ్ చంపేందుకు య‌త్నించ‌గా రాఖీభాయ్ వాళ్ల‌ను చంపేసి తాత‌ను కాపాడుతాడు. దీంతో రాఖీభాయ్ ఏం చేయ‌గ‌ల‌డో నారాచీలోని వారంద‌రికీ తెలుస్తుంది.

ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో కృష్ణ.జి.రావు మంచి గుర్తింపు వ‌చ్చింది. అంత‌క‌ముందు ఆయ‌న ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ కేజీఎఫ్ తాత‌గానే అంద‌రి మ‌న‌స్సుల్లో చెద‌ర‌ని ముద్ర శేశాడు. ఈ సినిమా తర్వాత ఈయనకు కన్నడలో వరుసగా అవకాశాలు వచ్చాయి. నటుడిగానే కాకుండా క‌థార‌చ‌యిత‌గా, అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా దాదాపు 40కిపైగా చిత్రాల్లో ప‌ని చేశాడు.

Next Story