సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు మృతి

Veteran actor Mithilesh Chaturvedi passes away of heart ailment. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సీనియర్‌ నటుడు మిథిలేష్ చతుర్వేది

By అంజి  Published on  4 Aug 2022 1:05 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సీనియర్‌ నటుడు మిథిలేష్ చతుర్వేది (68) కన్నుమూశాడు. లక్నోనిని ఆయన నివాసంలో గురువారం ఉదయం 4 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. గత కొంత కాలంగా మిథిలేష్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మిథిలేష్‌ అల్లుడు ఆశిష్‌ చతుర్వేది సోషల్‌ మీడియా వేదికగా మిథిలేష్‌ చనిపోయిన వార్తను తెలిపారు. గత పది రోజులుగా కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందారని చెప్పారు. ఆయన మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో మిథిలేష్ కొనసాగాడు. 1997లో వ‌చ్చిన 'భాయ్ భాయ్' మూవీతో సినిమాల్లోకి అడుగు పెట్టిన మిథిలేష్.. తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సినిమాల్లో న‌టించి ఇండ‌స్ట్రీలో గొప్ప న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'కోయి మిల్ గ‌యా', 'ఏక్ ప్రేమ్ క‌థ‌', 'స‌త్య‌', 'బంటీ ఔర్ బ‌బ్లీ', 'క్రిష్', 'తాల్‌', 'రెడీ' వంటి సినిమాలు ఈయ‌న‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈయ‌న ప‌లు టీవీ సిరీయళ్లలోనూ న‌టించాడు. మిథిలేష్‌ చివ‌ర‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌-ఆయుష్మాన్ ఖురానా న‌టించిన 'గులాబో సితాబో' సినిమాలో న‌టించాడు.

Next Story