విషాదం.. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు దిలీప్‌కుమార్ క‌న్నుమూత‌

Veteran Actor Dilip Kumar Passed away.బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 2:54 AM GMT
విషాదం.. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు దిలీప్‌కుమార్ క‌న్నుమూత‌

బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చాలా మంది న‌టీన‌టులు మ‌ర‌ణించ‌గా.. తాజాగా బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు దిలీప్ కుమార్ క‌న్నుమూశారు. వృద్దాప్యంతో పాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వయ‌స్సు 98 సంవ‌త్స‌రాలు.

కొద్ది రోజులుగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌త‌వారం ముంబైలోని హిందూజా ఆస్ప‌త్రిలో చేరారు. అప్ప‌టి నుంచి అక్క‌డే చికిత్స పొందుతున్నారు. కాగా.. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు ఆయ‌న భార్య సైరా భాను సోమ‌వారం చెప్పారు. మీ అందరి ప్రార్థనల వల్ల దిలీప్ కుమార్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని నమ్ముతున్నట్లు చెప్పారు. కానీ ఆ తరువాత‌ ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విషమించింది. బుధ‌వారం ఉద‌యం 7.30కి తుది శ్వాస విడిచారు.

దిలీప్‌ కుమార్‌ జన్మించింది ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌. ఆయన అసలు పేరు దిలీప్‌కుమార్‌ కాదు మ‌హ‌మ్మ‌ద్‌ యూసఫ్‌ ఖాన్‌. ఆయన జన్మించింది ఒక మధ్య తరగతి ముస్లీం కుటుంబంలో. ఉపాధి వెతుకుంటూ ఆ కుటుంబం ఇప్పటి ముంబాయి చేరుకున్నారు. అప్పటిలో అందాల నటి,' కురంగనయనాల దేవికారాణి ఆయనను ఫిలిం ప్రపంచానికి పరిచయం చేసింది. 1944లో 'జ్వార్ భాతా' చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆయ‌న వెనుదిరిగి చూసుకోవాల్సిన అవస‌రం రాలేదు.

ఆ త‌రువాత ఆయ‌న ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించారు. ప్రేమ వైఫల్యాలు, కష్టనష్టాలు, భగ్నమనోరధాల పాత్రలలో ఆయనకు విమర్శకులు 'ట్రాజెడీ కింగ్‌ ఆఫ్‌ ఇండియా అని పేరుపెట్టారు. అక్కినేని నాగేశ్వర రావ్ఞ 'లైలా మజ్నూ, 'దేవదాస్‌ మొదలైన చిత్రాలలో విషాద పాత్రలలో నటించడం వల్ల ఆయనకు కూడా 'ట్రాజెడీ కింగ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా పేరొచ్చింది.

Next Story