ప్రముఖ నటి అంజనా కన్నుమూత
ప్రఖ్యాత నటి అంజనా భౌమిక్ ఈరోజు, ఫిబ్రవరి 17న కన్నుమూశారు. ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు
By అంజి Published on 17 Feb 2024 1:30 PM IST
ప్రముఖ నటి అంజనా కన్నుమూత
ప్రఖ్యాత బెంగాలీ నటి అంజనా భౌమిక్ ఈరోజు, ఫిబ్రవరి 17న కన్నుమూశారు. ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు.. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, నీలాంజనా సేన్‌గుప్తా, చందనా శర్మ ఉన్నారు. అంజనా భౌమిక్ శ్వాసకోశ సంబంధిత సమస్యల కారణంగా ఫిబ్రవరి 16, శుక్రవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శనివారం తెల్లవారుజామున కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు. భౌమిక్ కుమార్తె నీలాంజనా సేన్‌గుప్తా నటుడు జిషు సేన్‌గుప్తాను వివాహం చేసుకున్నారు. ఆమె చిన్న కూతురు చందన కూడా నటి. అంజనా భౌమిక్ వయసు 79. అంజనా మృతితో సినీ పరిశ్రమ ఓ గొప్ప నటిని కోల్పోయింది.
వయసు సంబంధిత కారణాలతో చాలా కాలంగా అంజనా భౌమిక్ అనారోగ్యంతో ఉన్నారు. గత 5-6 నెలలుగా ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెను కుమార్తెలు నీలాంజన, చందన చూసుకుంటున్నారు. తల్లి మృతితో కూతుళ్లిద్దరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉత్తర బెంగాల్‌లోని కోచ్‌బీహార్‌లో డిసెంబర్ 30, 1944న జన్మించిన నటి అంజనా భౌమిక్ అసలు పేరు ఆరతి భౌమిక్, అయితే ఆమెను ముద్దుగా బాబ్లీ అని పిలిచేవారు. ఆమె తండ్రి దివంగత బిభూతిభూషణ్ భౌమిక్ కూడా నటుడు. అంజన కోచ్‌బిహార్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 1961లో, ఆమె కోచ్‌బిహార్‌లోని సునీతి అకాడమీ నుండి తన హయ్యర్ సెకండరీ పరీక్షకు హాజరైంది. తరువాత, ఆమె కోల్‌కతాకు వెళ్లింది, అక్కడ ఆమె డమ్ డమ్‌లోని సరోజినీ నాయుడు కాలేజ్ ఫర్ ఉమెన్‌లో తన విద్యను అభ్యసించింది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది.