వెంకటేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న తరుణ్ భాస్కర్.!

Venkatesh Tarun Bhaskar movie shooting will starts from July. వెంకటేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న తరుణ్ భాస్కర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 9:16 AM GMT
Venkatesh Tarun Bhaskar movie shooting will starts from July

మన తెలుగు స్టార్ హీరోల్లో ఫ్యామిలీ సినిమాలు అంటే ముందుగా వినిపించే హీరో పేరు విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ కథలు వెంకీకి బాగా నప్పే కథలు. అందుకే వెంకటేష్ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఇక వెంకీ చాలా రోజుల తర్వాత మరోసారి మంచి ఫ్యామిలీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. 'పెళ్ళి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. వెంకటేశ్‌ - తరుణ్‌ భాస్కర్‌ కాంబోలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. 'పెళ్ళి చూపులు' టైమ్‌లోనే వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆ ఊసుల ముచ్చటే లేదు.

అయితే ఇటీవల మళ్లీ ఆ కాంబో చర్చలోకి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా పాయింట్‌ కూడా బయటికొచ్చేసింది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖరులో సినిమా పట్టాలెక్కుతుందట. ప్రస్తుతం వెంకటేశ్‌ 'నారప్ప', 'ఎఫ్‌ 3' సినిమాల పనిలో ఉన్నారు. ఈ రెండూ అయ్యాక తరుణ్‌ భాస్కర్‌ సినిమా మొదలుపెడతాడట. మరోవైపు కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నాడట తరుణ్‌ భాస్కర్‌. రెండు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని సినిమాను సెట్స్‌పైకి ఎక్కించాలని నిర్మాత సురేశ్‌ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంత మాత్రం ఆకట్టుకుంటుందో..


Next Story
Share it