వీరసింహారెడ్డి ట్రైలర్.. బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లే..!

Veera Simha Reddy trailer out.నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2023 8:24 AM IST
వీరసింహారెడ్డి ట్రైలర్.. బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లే..!

నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ఒంగోలులో శుక్ర‌వారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. 'నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్… పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్.. అప్పాయింట్మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను.. లొకేషన్ చూడను… ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా నా కొడకా" అంటూ బాల‌య్య వాయిస్ తో మొద‌లైన ట్రైల‌ర్ అదిరిపోయింది. 'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..'' అంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ ట్రైల‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది.

దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నెగెటివ్ పాత్రల్లో క‌నిపించారు. ఇక బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించినా.. యాక్ష‌న్‌లో మాత్రం ఇర‌గ‌దీశాడు. ఇక థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచేశారు. ట్రైల‌ర్ చూసిన అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. బాల‌య్య ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ప‌డిన‌ట్లేన‌ని అంటున్నారు.

Next Story