అఫీషియల్.. 'వీరసింహా రెడ్డి' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Veera Simha Reddy OTT Release Date fix.నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం 'వీరసింహా రెడ్డి'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2023 12:31 PM IST
అఫీషియల్.. వీరసింహా రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం 'వీరసింహా రెడ్డి'. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతి హాసన్ న‌టించింది. బాల‌య్య డైలాగ్స్‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ మోత మోగింది.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. ఈ చిత్ర ఓటీటీ డేట్ ఫికైంది. డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను డిస్నీ+హాట్ స్టార్ విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 23 సాయంత్రం 6 గంట‌ల నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో బాల‌య్య అభిమానుల‌తో పాటు ఓటీటీలో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుద‌ల అవుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఫిబ్ర‌వ‌రి 23 నుంచి పండ‌గే.

క‌న్నడ స్టార్ నటుడు దునియా విజయ్ విలన్‌గా న‌టించ‌గా వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మలు కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. థియేట‌ర్ల‌ల‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎంత హిట్ అవుతుందో చూడాల్సిందే.

Next Story