'రోర్ ఆఫ్ వీర‌సింహారెడ్డి'.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న మేకింగ్ వీడియో

Veera Simha Reddy Making Video release.నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీర సింహా రెడ్డి'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2022 2:38 PM IST
రోర్ ఆఫ్ వీర‌సింహారెడ్డి..  గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న మేకింగ్ వీడియో

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీర సింహా రెడ్డి'. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌ ప్రతినాయకుడి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం అవుట్‌ అండ్ అవుట్ మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 12న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది చిత్ర బృందం. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్ చిత్రంపై అంచ‌నాలు పెంచేశాయి. కొత్త సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని కొద్ది సేప‌టి క్రితం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో ఈ చిత్రంలో ప‌లు కీల‌క స‌న్నివేశాలు, పాట‌లు ఎలా చిత్రీక‌రించారో చూపించారు. షూటింగ్ చూసేందుకు వ‌చ్చిన బాల‌య్య కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఈ మేకింగ్ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. గుడి దగ్గర సన్నివేశం ఈ చిత్రానికే హైలెట్‌గా నిల‌వ‌నున్న‌ట్లు అర్థం అవుతోంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మేకింగ్ వీడియో చూస్తుంటే బాల‌య్య మ‌రోసారి సంక్రాంతి హీరోగా నిల‌వ‌నున్నాడ‌ని అర్థం అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి పోటీగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీరయ్య' జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ సంస్థే నిర్మించ‌డం విశేషం. సినీ ఇండస్ట్రీ చ‌రిత్ర‌లో ఒకే బ్యానర్‌లో తెరకెక్కిన రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి.

Next Story