వ‌రుణ్‌తేజ్ 'గ‌ని' ట్రైల‌ర్‌కు ముహూర్తం ఖ‌రారు

Varuntej Ghani Trailer to release on March 17th.మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన‌ చిత్రం గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2022 8:09 AM GMT
వ‌రుణ్‌తేజ్ గ‌ని ట్రైల‌ర్‌కు ముహూర్తం ఖ‌రారు

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన‌ చిత్రం 'గ‌ని'. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో వ‌రుణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ న‌టించింది. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, జ‌గ‌ప‌తి బాబు వంటి న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా ప‌లు మార్లు వాయిదా ప‌డుతూ.. ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్స్‌, టీజ‌ర్‌లు సినిమాల‌పై అంచ‌నాల‌ను పెంచ‌గా.. మార్చి 17 ఉద‌యం 10.30గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఓస్పెష‌ల్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసింది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ, సిద్ధూ ముద్ద సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story
Share it