మెగాప్రిన్స్ కొత్త సినిమా అప్‌డేట్‌.. అంచ‌నాలు పెంచేసిన ఫ‌స్ట్‌లుక్‌

Varun Tej's next titled Gandeevadhari Arjuna.మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గరుడ వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2023 3:10 PM IST
మెగాప్రిన్స్ కొత్త సినిమా అప్‌డేట్‌.. అంచ‌నాలు పెంచేసిన ఫ‌స్ట్‌లుక్‌

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గరుడ వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. వీటీ 12 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మై చాలా రోజులైన‌ప్ప‌టి ఎటువంటి అప్‌డేట్ లేదు. అయితే.. నేడు(జ‌న‌వ‌రి 19) వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిట్‌తో పాటు వ‌రుణ్ తేజ్ ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

ఈ చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్ర‌ఖ్యాత లండ‌న్ బ్రిడ్జి పై యాక్ష‌న్ స‌న్నివేశానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. వ‌రుణ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు 80 శాతం పూరైంది. మిగ‌తా 20 శాతం త్వ‌ర‌లోనే పూర్తి చేసి విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు. గూడ‌ఛారి నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story