నాలుగు లుక్స్ లో కనిపించనున్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ పాన్-ఇండియన్ చిత్రం "మట్కా" మీద మంచి అంచనాలు
By Medi Samrat Published on 7 Jun 2024 4:30 PMవరుణ్ తేజ్ పాన్-ఇండియన్ చిత్రం "మట్కా" మీద మంచి అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ గత సినిమాలు ఊహించని ఫ్లాప్ లను అందుకున్నాయి. గని, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో మట్కా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పలు కారణాలతో నిర్మాణం ఆలస్యం అయింది. కొంత గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారు.
రజనీ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మట్కా కొత్త షెడ్యూల్ జూన్ 19 నుండి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నాడు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
Next Story