'గని' రిలీజ్ డేట్ ఫిక్స్.. 'భీమ్లా నాయక్' వాయిదా పడినట్లేనా

Varun Tej 'Ghani' to release in cinemas on February 25.మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం గ‌ని. కిరణ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Feb 2022 9:58 AM GMT
గని రిలీజ్ డేట్ ఫిక్స్.. భీమ్లా నాయక్ వాయిదా పడినట్లేనా

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం 'గ‌ని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వ‌రుణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ న‌టిస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో త‌మ‌న్నా ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

ఎట్ట‌కేల‌కు చిత్ర‌బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక‌కుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మూడేళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంటామన్న నమ్మకం ఉందని హీరో వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'భీమ్లానాయ‌క్' ను ఫిబ్ర‌వ‌రి 25న లేదా ఏప్రిల్ లో మ‌రో డేట్‌లో విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' పోస్ట్ పోన్ కావ‌డంతోనే అబ్బాయి వరుణ్ 'గని' విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాడ‌ని అంటున్నారు. ఇది పవన్ అభిమానులకు మరింత నిరాశ కలిగిస్తోంది.

Next Story