మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఫిబ్రవరి 25న విడుదల చేస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేసినా.. అదే రోజున పవర్ స్టార్ నటించిన 'భీమ్లా నాయక్' విడుదలవడంతో మరోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని చూసుకుని ఈ సారి మరో డేట్‌ను లాక్ చేసింది చిత్రబృందం. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.