గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదంటున్న వరుణ్ తేజ్

Varun Tej Ghani Movie trailer out.మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన చిత్రం గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2022 10:20 AM GMT
గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదంటున్న వరుణ్ తేజ్

మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన చిత్రం 'గ‌ని'. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వ‌రుణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ న‌టిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

'గ‌ని ఇక జీవితంలో బాక్సింగ్ ఆడ‌ను అని ప్రామిస్ చేయి' అని న‌దియా చెబుతున్న డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. 'ఒక వేళ అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే.. అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజవ్వాలి'. ` 'ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి' 'ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది' అంటూ వరుణ్ చెబుతున్న డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైల‌ర్ మొత్తం యాక్ష‌న్ సీన్స్‌తోనే నిండిపోయింది.

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు.

Next Story
Share it