కొంచెమైనా మానవత్వం చూపించండి.. ఫోటోలు తీస్తున్న వారికి బాలీవుడ్ హీరో సలహా

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మరణించారనే విషాద వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు షాక్ కు గురిచేసింది

By Medi Samrat  Published on  11 Sept 2024 9:45 PM IST
కొంచెమైనా మానవత్వం చూపించండి.. ఫోటోలు తీస్తున్న వారికి బాలీవుడ్ హీరో సలహా

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మరణించారనే విషాద వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు షాక్ కు గురిచేసింది. మలైకా కుటుంబాన్ని పరామర్శించడానికి పలువురు వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు వరుణ్ ధావన్ ఫోటోగ్రాఫర్ల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కెమెరాలను గురిపెట్టి, దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని చిత్రీకరించే వారి అనుచిత ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. కొన్నిసార్లు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బుధవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ముంబైలోని బాంద్రాలో తన ఫ్లాట్ పైనుంచి దూకి ఆయ‌న‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆయ‌న‌ ఇంటిని సీజ్ చేశారు. విష‌యం తెలిసిన‌ మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమకు చాలా షాకింగ్ న్యూస్. మలైకా అరోరా తండ్రి అనిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Next Story