'వ‌రుడు కావ‌లెను' టీం స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల

Varudu Kavalenu Surprise Video Release.టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం 'వ‌రుడు కావ‌లెను' స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2021 4:58 AM GMT
Varudu Kavalenu Surprise Video Release

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం 'వ‌రుడు కావ‌లెను'. పెళ్లి చూపులు ఫేం రీతూవ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా.. సీనియ‌ర్ న‌టీన‌టులు ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ల‌క్ష్మీ సౌజ‌న్య (డెబ్యూట్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. కాగా.. ఈ రోజు నాగ‌శౌర్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర బృందం స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల చేసింది. ఇందులో నాగ శౌర్య రెట్రో లుక్‌లో క‌నిపిస్తున్నాడు. శౌర్య మరింత అందంగా అలంకరించుకోవడం, ముస్తాబవుతున్న దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.

ఈ చిత్రాన్ని మే లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వీడియో చివ‌ర్లో చెప్పారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్. ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో ను కూడా విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంతో పాటు నాగ‌శౌర్య.. సంతోష్‌ జాగర్లపూడి ద‌ర్శ‌కత్వంలో ల‌క్ష్య అనే సినిమా చేస్తున్నాడు. కేతికశర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్‌ కె నారంగ్‌, రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. మ‌రోవైపు కేపీ రాజేంద్ర దర్శకత్వంలో 'పోలీసు వారి హెచ్చరిక' అనే టైటిల్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య‌.


Next Story