దసరాకు 'వరుడు కావలెను'

Varudu Kavalenu releasing on October 15th.యంగ్ హీరో నాగశౌర్య న‌టించిన తాజా చిత్రం వ‌ర‌డు కావ‌లెను. లక్ష్మీ సౌజ‌న్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2021 7:34 AM GMT
దసరాకు వరుడు కావలెను

యంగ్ హీరో నాగశౌర్య న‌టించిన తాజా చిత్రం 'వ‌ర‌డు కావ‌లెను'. లక్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈచిత్రంలో శౌర్య స‌ర‌స‌న రీతూ వ‌ర్మ న‌టించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్నిచిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్టులుక్‌, పాట‌లకు విశేష‌ స్పంద‌న ల‌భిస్తోంది. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుండ‌డంతో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో చిత్ర‌బృందం వేగం పెంచింది.

Next Story