రెండు డోసుల టీకా తీసుకుంటేనే ఆర్ఆర్ఆర్ థియేట‌ర్లకి అనుమ‌తి

Varma comments on RRR release in theatres amidst Omicron cases.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Dec 2021 9:34 AM GMT
రెండు డోసుల టీకా తీసుకుంటేనే ఆర్ఆర్ఆర్ థియేట‌ర్లకి అనుమ‌తి

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండ‌డంతో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు ఆంక్ష‌ల బాట‌లు ప‌ట్టాయి. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. బూస్ట‌ర్ డోసులు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మవుతోంది. అయిన‌ప్ప‌టికి కొంద‌రు మాత్రం వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఇష్టం చూపించ‌డం లేదు. వ్యాక్సిన్ అంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఎవ్వ‌రూ ఎంత‌గా న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికి, ప్ర‌భుత్వాలు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు మాత్రం స‌సేమీరా అంటున్నారు.

అయితే.. వాళ్ల‌ను వ్యాక్సిన్ తీసుకునేలా చేస్తాన‌ని అంటున్నాడు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. తాను ఇచ్చి ఐడియా క‌నుక అమ‌లు చేస్తే దాదాపు అంద‌రూ క‌రోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటార‌ని అంటున్నాడు. ఇంత‌కీ వ‌ర్మ ఇచ్చిన ఐడియా ఏంటంటే..? 'ఒమిక్రాన్ గురించి ప్రభుత్వాలకు కావాల్సిన గొప్ప ఐడియా నా వ‌ద్ద ఉంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుద‌ల సమయంలో డ‌బుల్ డోస్ టీకా తీసుకున్న వారిని మాత్రమే థియేట‌ర్లలోకి అనుమ‌తి ఇవ్వాలి. ఆర్ఆర్ఆర్ సినిమా చూడాల‌న్న ఉద్దేశంతోనైనా చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటారు'. అంటూ ఆర్జీవి ట్వీట్ చేశాడు.

ప్ర‌స్తుతం వ‌ర్మ ఇచ్చిన ఐడియా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు. కొంద‌రు మంచి ఐడియా అంటూ మెచ్చుకుంటుండ‌గా.. మ‌రికొంద‌రు చెత్త ఐడియా అని అంటున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్(రౌద్రం, ర‌ణం, రుధిరం)' చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా న‌టిస్తున్న ఈచిత్రంలో అలియాభట్‌, ఓలీవియా మోరీస్ క‌థానాయిక‌లు. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story