ఫ్యాన్స్‌ ట్రైలర్స్ వ‌చ్చేస్తున్నాయ్‌.. నేడు వారిసు.. 6న వీరసింహారెడ్డి..

Varisu, Veerasimha Reddy Reddy Trailers. రేపు రెండు భారీ చిత్రాల ట్రైలర్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ హీరోగా

By Sumanth Varma k  Published on  4 Jan 2023 9:38 AM IST
ఫ్యాన్స్‌ ట్రైలర్స్ వ‌చ్చేస్తున్నాయ్‌.. నేడు వారిసు.. 6న వీరసింహారెడ్డి..

రేపు రెండు భారీ చిత్రాల ట్రైలర్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రం "వారిసు". తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న వారసుడు అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5 గంటలకు సన్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కార్తీక్ పళని ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీలో శరత్ కుమార్, కుష్బూ, ప్రకాష్ రాజ్, యోగి బాబు, జయసుధ, ప్రభు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

అలాగే ఈ సినిమాతో పాటు బాలకృష్ణ కథానాయకుడిగా.. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో 'వీరసింహారెడ్డి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ కూడా జనవరి 6న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే ఒంగోలులోని ABM కాలేజ్ గ్రౌండ్స్ లో, జనవరి 6వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకలోనే ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారు.


Next Story