సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై స్పందిన వైష్ణవ్ తేజ్
Vaishnav Tej reveals good news about Sai Tej discharge.సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో
By తోట వంశీ కుమార్ Published on
3 Oct 2021 6:36 AM GMT

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన కోమాలో ఉన్నారని అంటుండగా.. మరికొందరు ఆయన కోలుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాజాగా సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్య్వూలో తేజు ఆరోగ్యంపై స్పందించారు.
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం 'కొండపొలం' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తేజు ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. సాయి ఆరోగ్యం బాగుందని.. త్వరలోనే కోలుకుంటాడని అన్నారు. ప్రస్తుతం ఫిజికల్ థెరపీ జరుగుతోందని.. బహుళా మరో వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సాయిధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' చిత్రం అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే.
Next Story