ఆక‌ట్టుకుంటున్న 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు'

Vaddanam Song out from Varudu Kaavalenu movie.యంగ్ హీరో నాగ‌శౌర్య తాజాగా న‌టిస్తున్న చిత్రం వ‌రుడు కావ‌లెను.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2021 8:17 AM GMT
ఆక‌ట్టుకుంటున్న వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు

యంగ్ హీరో నాగ‌శౌర్య తాజాగా న‌టిస్తున్న చిత్రం 'వ‌రుడు కావ‌లెను'. ల‌క్ష్మీసౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శౌర్య స‌ర‌స‌న రీతువర్మ న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి అయ్యింది. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌పుకుంటోంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపుదిద్దుకున్న ఈచిత్రం అక్టోబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం వేసింది.

తాజాగా వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు అనే పాట‌ను విడుద‌ల చేశారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందించిన ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story
Share it