అఫీషియల్..'వారసుడు' ఓటిటి డేట్ వచ్చేసింది
Vaarasudu to stream on Amazon Prime Video from February 22.తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'వారిసు'.
By తోట వంశీ కుమార్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ.250 కోట్లపైగా కలెక్షన్లు సాధించింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురుచూస్తుండగా వారికి శుభవార్త చెప్పింది చిత్రబృందం. ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఫిబ్రవరి 22 నుంచి తెలుగు, తమిళంతో పాటు మలయాళం బాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
hold tight because the wait is over!
— prime video IN (@PrimeVideoIN) February 17, 2023
here he comes 🤩#VarisuOnPrime, Feb 22
coming soon in Tamil, Telugu and Malayalam!#Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp pic.twitter.com/AM8xYn44bi
దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడడం మిస్ అయిన వారు ఆ రోజు నుంచి ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించగా జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు తదితరులు కీలకపాత్రలలో నటించారు.