హిట్ 2: 'ఉరికే ఉరికే' వీడియో సాంగ్ ప్రొమో.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్

Urike Urike Song Promo Out Now from HIT 2 movie. టాలీవుడ్‌లో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అడివి శేష్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 4:19 AM GMT
హిట్ 2: ఉరికే ఉరికే వీడియో సాంగ్ ప్రొమో.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అడివి శేష్‌. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ స‌ర‌స‌న మీనాక్షి చౌదరీ న‌టిస్తోంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబ‌ర్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఒక్కొక్క‌టిగా అప్ డేట్ ఇస్తూ సినిమాని ఆస‌క్తిని పెంచుతోంది. తాజాగా ఉరికే ఉరికే అనే రొమాంటిక్ సాంగ్ ప్రొమోను విడుద‌ల చేశారు. ఈ పాట‌లో అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంది. అందమైన విజువల్స్, అందుకు తగినట్లుగా ఉన్న మ్యూజిక్ మొత్తానికి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తోంది.

కృష్ణ‌కాంత్ సాహిత్యాన్ని అందించ‌గా ఎం.ఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించారు. సిద్ శ్రీరామ్‌తో పాటు రమ్యా బెహ్రా ఆల‌పించిన ఈ పాట విన‌డానికి ఎంతో బాగుంది. పూర్తి పాట‌ను ఈ నెల 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది.

Next Story