ఉప్పెన టీజ‌ర్‌.. అంద‌మైన ప్రేమ‌క‌థ‌

Uppena Teaser released.మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'ఉప్పెన‌' టీజ‌ర్ విడుద‌ల.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 11:11 AM GMT
Uppena Teaser released

మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'ఉప్పెన‌'. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న కృతిశెట్టి న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మింస్తుండ‌గా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. గ‌తేడాది వేస‌వి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది.

ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్న నేప‌థ్యంలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

'దేవుడే వరాలిస్తాడాని నాకు అర్థం అయింది.. ఎవరికి పుట్టామో మనకు తెలుస్తుంది.. ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. 'లవ్ యూ ఐ' అని రాసిన కృతి.. మన మధ్య లవ్ ఎందుకులే అని పక్కకకి జరిపేశాను హీరో చెప్పే డైలాగ్‌.. 'ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బ్రతికేద్దాం' అని హీరోయిన్ చెప్పడం.. చివర్లో హీరో సముద్రపు ఒడ్డున పడి ఉండటం చూస్తుంటే ఇదొక విషాదాంత ప్రేమ కథ అనే డౌట్ కలిగిస్తోంది. దీనికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.


Next Story