ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటుంది.. దానికి భవిష్యత్తు ఉండదు

Uppena Movie Trailer.సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన ట్రైలర్ ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2021 4:26 PM IST
Uppena Movie Trailer

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన‌'. కృతిశెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఈ చిత్రంలో 'నీ క‌ళ్లు నీలి స‌ముద్రం', 'జ‌ల జ‌ల జ‌ల‌పాతం' నువ్వూ అంటూ విడుద‌లైన సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. విజ‌య్‌సేతుప‌తి విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. ఫిబ్ర‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ ఎంత‌గానే ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు.

'ప్రేమంటే ఓ లైలా మజ్ను లా.. దేవదాసు పార్వతి లా.. ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిలా ఉండాలి రా' అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. 'ప్రేమంటే పట్టుకోవడం.. వదిలేయడం కాదు..' 'ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో సమాధుల్లోనో కనపడాలి కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు' వంటి డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. రాక్‌స్టార్ దేవీశ్రీప్ర‌సాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అద‌న‌పు ఆకర్ష‌ణ‌గా నిలిచింది.


Next Story