వంద కోట్ల క్ల‌బ్‌లో ఉప్పెన‌.. మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు అంటూ..

Uppena movie cross 100 crore gross.100 కోట్ల క్ల‌బ్ అనేది అంద‌రూ స్టార్ హీరోల‌కు సాధ్య ప‌డ‌దు. అలాంటి ఓ డెబ్యూ హీరో 100 కోట్ల క్ల‌బ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2021 3:39 PM IST
Uppena movie cross 100 crore gross.

100 కోట్ల క్ల‌బ్ అనేది స్టార్ హీరోల అంద‌రికీ కూడా సాధ్య ప‌డ‌దు. అలాంటి ఓ డెబ్యూ హీరో 100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌తాడ‌ని ఎవ‌రైనా ఊహిస్తారా..? కానీ ఆ అరుదైన ఫీట్‌ని సాధించాడు మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌. లాక్‌డౌన్ త‌ర్వాత సినిమా రంగం ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని అంద‌రూ ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో ఉప్పెన చిత్రం అందించిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. సున్నిత‌మైన ప్రేమ క‌థాంశంగా రూపొందిన ఉప్పెన చిత్రం తొలి రోజు నుండే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళ రాబ‌డుతూ అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. న‌టించిన తొలి సినిమాతోనే ఇంత‌టి రేర్ రికార్డును సాధిచాడు వైష్ణ‌వ్‌.. వ‌స్తూనే కుంభాన్ని కొట్టాడ‌నే చెప్పాలి.

డెబ్యూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు, డెబ్యూ హీరో వైష్ణ‌వ్ తేజ్, డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి క‌లిసి చేసిన మ్యాజిక్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించింది. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో క‌నిపించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరింద‌ని చిత్ర బృందం అఫీషియ‌ల్ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఉప్పెనంత మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. వంద కోట్ల గ్రాస్ అంటే 50కోట్ల షేర్ క్లబ్ లో అడుగుపెట్టిందనే అర్థం. 22 రోజుల్లోనే ఇలాంటి అరుదైన ఫీట్ ని అందుకుంది ఉప్పెన.




Next Story