క‌బ్జా ట్రైల‌ర్.. షాకింగ్ రెస్పాన్స్‌

ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం క‌బ్జా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 10:24 AM IST
Kabzaa Trailer,  Upendra,

ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌

ఇటీవ‌ల కాలంలో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన 'కేజీఎఫ్', 'కాంతార‌', 'విక్రాంత్ రోణా' వంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. దీంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి ఎలాంటి సినిమా వ‌స్తుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్‌ను ఎగ్జెట్మెంట్‌గా మారుస్తూ 'క‌బ్జా' చిత్రం వ‌స్తోంది.

ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌, శివరాజ్ కుమార్, శ్రియ వంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు అభిమానులను ఆక‌ట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో ఏడు భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు.

అందులో భాగంగా ఒక్కొ భాష‌లో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తుంటే దర్శకుడు చూపించిన ప్రతి విజువల్ కూడా సాలిడ్ గా ఉండగా ఎమోషన్స్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story