షూటింగ్ స్పాట్‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన స్టార్ హీరో

Upendra hospitalised after developing breathing issues.క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర షూటింగ్‌ స్పాట్‌లో అస్వ‌స్థ‌త‌కు గురి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 8:15 AM IST
షూటింగ్ స్పాట్‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన స్టార్ హీరో

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర షూటింగ్‌లో అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యాడు. వెంట‌నే ఆయ‌న్ను బెంగ‌ళూరులోని నేల మంగ‌ళ‌లోని హ‌ర్ష ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. చికిత్స తీసుకున్న అనంత‌రం తిరిగి ఆయ‌న షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా.. శ్వాస సంబంధ స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఆస్ప‌త్రికి వెళ్లారు. డ‌స్ట్ అల‌ర్జీ కార‌ణంగా షూటింగ్ లోకేష‌న్‌లో ఉపేంద్ర శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. ఉపేంద్ర‌ను పూర్తిగా ప‌రీక్షించిన వైద్యులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.

ఇక తాను ఆస్ప‌త్రికి వెళ్లాన‌ని తెలిసి అభిమానులు ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు అని తెలుసుకున్న ఉపేంద్ర సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. ఆ వీడియోలో తాను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు చెప్పాడు. అభిమానులు ఎవ్వ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నాడు. షూటింగ్‌లో స్పాట్‌లోనే ఉన్న‌ట్లు తెలిపాడు.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఉపేంద్ర చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆయన నటిస్తున్న 'కబ్జా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Next Story