పుట్టింటికి వెళ్లిన ఉపాస‌న‌.. ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Upasana shares first post after announcing pregnancy.మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు తల్లిదండ్రులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2022 2:37 PM IST
పుట్టింటికి వెళ్లిన ఉపాస‌న‌.. ఎమోష‌న‌ల్ పోస్ట్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు తల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మెగా ఫ్యామిలీలో సంబ‌రాలు మిన్నంటాయి. ఇక ఉపాస‌న త‌న పుట్టింటికి వెళ్లింది. పుట్టింటి వారితో క‌లిసి ఎంతో ఆనందంగా గ‌డిపారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఉపాస‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ఎంటర్ కావడం ఆనందంగా ఉంది" అంటూ తన తల్లి, అమ్మమ్మ, ఇతర కుటుంబ స‌భ్యుల‌తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ స‌మ‌యంలో అత్త‌మ్మ‌ను ( మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌)మిస్ అవుతున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

రామ్‌చరణ్, ఉపాసన లు త‌ల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోమ‌వారం మ‌ధ్యాహ్నాం చిరంజీవి చెప్పారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారని.. త్వరలోనే వారికి బిడ్డ పుట్టబోతున్నాడని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రామ్ చరణ్ – ఉపాసన వివాహం 2012లో జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ప్ర‌క‌టించ‌డంతో మెగా అభిమానులు, పలువురు ప్రముఖులు రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

Next Story