అన్‌స్టాప‌బుల్ 2 ప్రొమో.. 'దెబ్బ‌కి థింకింగ్ మారిపోవాలి'

Unstoppable with NBK Season 2 Trailer.నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అన్‌స్టాప‌బుల్ షో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 12:34 PM IST
అన్‌స్టాప‌బుల్ 2 ప్రొమో.. దెబ్బ‌కి థింకింగ్ మారిపోవాలి

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన 'అన్‌స్టాప‌బుల్' షో సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ షో గా నిలిచింది. దీంతో సీజ‌న్ 2 కోసం ప్రేక్ష‌కులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. రెండో సీజ‌న్‌కు సంబంధించి అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పింది ఆహా టీమ్‌. ఈ నెల‌(అక్టోబ‌ర్‌) 14 నుంచి 'అన్‌స్టాప‌బుల్ 2' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను నేడు విడుద‌ల చేశారు.

''ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!!మీకోసం... మరింత రంజుగా... అక్టోబర్ 14 నుంచి 'అన్‌స్టాప‌బుల్‌ 2' స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ఆహాలో విడుదల కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!'' అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా.

గత సీజన్‌లో మోహన్ బాబు, నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, రవితేజ, గోపిచంద్ మలినేని, మహేశ్ బాబు తదితరులు ఈ షోకు హాజరయ్యారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది రాబోతున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క శెట్టి లాంటి వాళ్లు ఇందులో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

Next Story