హీరోయిన్ కావాలంటే కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు
Unstoppable with NBK S2 Episode 6 Promo.నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2022 12:23 PM ISTనందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో తొలి సీజన్‌ను పూర్తి చేసుకుని రెండో సీజన్‌లోనూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఇక ఆరో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ తాజాగా విడుదల చేసింది.
అలనాటి హీరోయిన్లు జయప్రద, జయసుధతో పాటు ప్రస్తుత కథానాయిక రాశిఖన్నా ఈ షోకు వచ్చారు. ఈ ముగ్గురు బాలయ్యతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసి తమ కెరీయర్, తోటి నటీనటులు, సినిమా రంగం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాశిఖన్నాను బాలయ్య తెగపొడిగారు. ఆమె నవ్వుకి ఫిదా అయ్యాను అని అన్నారు. ఇక రాశి ఖన్నా తాను నటించిన 'ఊహలు గుసగుసలాగే' చిత్రంలోని ఏం సందేహం లేదు పాట పాడింది.
ఆ తరువాత ముగ్గురిని బాలయ్య కొన్ని సరదా ప్రశ్నలను అడిగారు. ప్రస్తుతం తాను, శ్రుతి హాసన్ హాట్ ఫెయిర్ అని చెప్పాడు. శ్రుతి హాసన్, బాలకృష్ణ కలిసి 'వీర సింహా రెడ్డి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ కావాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. ఇది నిజమా..? కాదా..? అని ప్రశ్నించగా అవును అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నటీమణులు. ఇక మొత్తం ఎపిసోడ్ డిసెంబర్ 23న స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రొమోను ఆహా బృందం విడుదల చేసింది. ప్రభాస్‌తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు గోపిచంద్ కూడా వచ్చారు. ఈ ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.