బాలయ్యతో బాహుబలి.. గ్లింప్స్ అదిరింది

Unstoppable season 2 Prabhas episode glimpse released.బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌-2

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2022 10:19 AM IST
బాలయ్యతో బాహుబలి.. గ్లింప్స్ అదిరింది

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌-2'. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ పొందింది. ఈ షోలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సంద‌డి చేశాడు. త‌న ప్రాణ స్నేహితుడు గోపిచంద్ తో క‌లిసి ఈ షోలో పాల్గొన్న ప్ర‌భాస్‌.. బాల‌య్య‌తో ఎన్నో విశేషాలు పంచుకున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్ర‌సారం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ ఎపిసోడ్‌కు సంబంధించి చిన్న గ్లింప్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది ఆహా సంస్థ‌. ప్ర‌భాస్ చాలా సింపుల్‌గా షోలోకి అడుగుపెట్టి హాయ్ డార్లింగ్ అంటూ అక్క‌డ ఉన్న వారికి అభివాదం చేశాడు. బాల‌య్య ను కౌగిలించుకున్నాడు. బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భాస్ స‌ర‌దా స‌మాధానాలు చెప్పిన‌ట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చివ‌ర్లో ఆహా సంస్థ తెలిపింది. ప్ర‌స్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story